రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ ఎస్ పార్టీ కలిసి పోటీ చేయదని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మా రెండు పార్టీల మధ్య స్నేహపూరిత సంబంధాలున్నప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు. 2019 వ సంవత్సరం తమ పార్టీకి మంచి ఆరంభం ఇచ్చిందంటూ.. 2020లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో శుభారంభం చేస్తామని అన్నారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొత్త మున్సిపల్ చట్టం అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అంటూ.. బిజెపి తన చిన్నప్పుడు ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉందని చెప్పారు. హైదరాబాద్ లో పాతబస్తీకి మెట్రో తప్పకుండా వస్తుందని మంత్రి తెలిపారు.