telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న అరెస్ట్ పై స్పందించిన తమ్మినేని

ap speaker tammineni

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అధికారులు తనకు సమాచారం అందించారని స్పష్టం చేశారు. ఏసీబీ కోర్టు నుంచి, జైళ్ల విభాగం నుంచి కూడా తనకు సమాచారం వచ్చిందని స్పీకర్ వివరించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ప్రక్రియలో ఎక్కడా విధానపరమైన లోపం లేదని, నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలిపారు.

ఈఎస్ఐ ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ నిర్ధారించిందని, ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నందునే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. అచ్చెన్నాయుడు బీసీ అయినందునే ఇందులోకి లాగారంటూ ఆరోపణలు వస్తున్నాయని, బీసీ అయితే నేరం చేసినా పట్టించుకోకూడదా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. తప్పు చేసింది అచ్చెన్నాయుడు అయితే దాన్ని బీసీలందరికీ ఎలా ఆపాదిస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. అక్రమాలకు, బీసీలకు ఏమిటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts