తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రాజెక్ట్ వద్ద గోదావరి జల దీక్ష చేయడానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.గోదావరి పెండింగు ప్రాజెక్టులను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాశామని అన్నారు.
కానీ కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సర్కారును హెచ్చరించారు. తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తుమ్మిడి హట్టి రిజర్వాయర్ సందర్శనను రద్దు చేసుకున్నారు.