telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రశాంతంగా ముగిసిన హుజూర్‌నగర్‌ పోలింగ్

evm with candidate photos

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటలకు 31.34 శాతం మధ్యాహ్నం 1 గంటలకు 52.89 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3గంటలకు 70శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 85శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్ కు చేరుకుని క్యూలైన్ లో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కను వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు తుది ఫలితం వెలువడనుంది.

Related posts