బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. ఇంట్లోని బాత్ రూమ్‌లో జారిపడడంతో మెదడుకి గాయాలై కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు ఐదేళ్ల పాటు ఆయన కోమాలో ఉన్నారు. పరిస్తితి విషమించడంతో ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఓ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని మోదీ అన్నారు.
జశ్వంత్ సింగ్ సొంత ప్రాంతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. ఆయన వాజ్‌పేయీ హయాంలో ఆయన రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా కొనసాగారు. 1950లో ఆర్మీలో చేరి, ఆర్మీ అధికారిగా సేవలందించారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 1980 నుంచి 2014 మధ్య కాలంలో పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు.