అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన 25 ఏళ్ల అభిషేక్ సుధేశ్ ను ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని ఓ హోటల్ లో చోటు చేసుకుంది.కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో అభిషేక్ కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేస్తున్నాడు. ఒక హోటల్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆ హోటల్ లోనే అభిషేక్ హత్యకు గురయ్యాడు.
మరో నాలుగు నెలల్లో అతని చదువు పూర్తికాబోతున్న తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అభిషేక్ చనిపోయినట్టు గురువారం రాత్రి 11.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. హోటల్ లో అభిషేక్ ను కాల్చి చంపారని మాత్రమే ఫోన్ లో చెప్పారని, ఇంతకు మించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అతని కుటుంబసభ్యులు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదు: సీపీఐ నేత చాడ