telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం: సీఎం జగన్

jagan

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. “కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. కార్మికుల స్వేదంతోపాటు వారి జీవితాలను ధారబోయడం వల్లే ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు” అని జగన్‌ ట్వీట్‌ చేశారు. కరోనా కారణంగా నేడు మేడే హంగు, ఆర్భాటాలు లేకుండా కార్మికులు జరుపుకుంటున్నారు.

Related posts