ప్రజల బ్యాంకు ఖాతాలలో 15 లక్షల వరకు డిపాజిట్ చేస్తున్న.. మోడీ ప్రభుత్వం.. !!
గత ఎన్నికలలో మోడీ అవినీతి సొమ్మును బయటకు తెస్తానని, అలా వచ్చిన డబ్బును ప్రజలందరి బ్యాంకు ఖాతాలలో 15 లక్షల చొప్పున వేస్తానని అని వాగ్దానం చేశారు. అది జరగకపోగా, అవినీతి ప్రభుత్వం అని బీజేపీ మెడకు రాఫెల్ ఒప్పందం చుట్టుకుంది. అయితే ఈ నగదు డిపాజిట్ విషయం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తోందన్న ప్రచారంతో పోస్టాఫీసుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. బీహార్‌లోని మోతీహారీ గ్రామంలో జరిగిందీ ఘటన. ఎలా వ్యాపించిందో కానీ మోదీ అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తున్నారన్న వదంతి వ్యాపించింది.
ఈ వార్త వ్యాపించడంతో.. అందులో నిజం ఉందాలేదా అనేది పట్టించుకోకుండా, గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. గ్రామస్థులందరూ పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో జాతరను తలపించింది. మహిళలు, పురుషులు క్యూల్లో గంటల కొద్దీ నిలబడ్డారు. ఈ వార్తలో నిజం లేదని, అదంతా అబద్ధమని చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఆకలి దప్పులు మరచిపోయి మరీ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపారు. మొత్తానికి ఈ వదంతి సంగతి పక్కనపెడితే, కొత్త ఖాతాలు బోలెడన్ని తెరుచుకోవటం అనేది ప్రయోజనం గా మిగిలిపోయింది అని అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం: లక్ష్మీపార్వతి