telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా? లేక కంపెనీ ఇస్తుందా?: అచ్చెన్నాయుడు

Atchannaidu tdp

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఘాటుగా స్పదించారు. ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోన్న తీరుపై ఆయన మండిపడ్డారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని అచ్చెన్నాయుడు పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మృతులకు జగన్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారని, అయితే, ఆ రూ.కోటి ప్రభుత్వం ఇస్తుందా? లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీ ఈ పరిహారాన్ని ఇస్తే ఇంతకు పదిరెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

గ్యాస్‌ లీక్‌ తర్వాత పరిశ్రమను విశాఖ నుంచి తరలిస్తామని సీఎం ప్రకటన చేయకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురై మృతదేహాలతో నిరసన తెలుపుతున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖకు రావడంతో ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారని అన్నారు. అయితే గ్యాస్‌ లీక్‌ బాధితులను కలిసి పరామర్శించకముందే పరిశ్రమ ప్రతినిధులను ఆయన కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

Related posts