telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని స‌మ‌ర్ధించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్ర‌క‌టించడం పై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన సమయంలో రష్యాలో అడుగు పెట్టానని, రష్యా యుద్ధం ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో ఇమ్రాన్‌ ఖాన్ రష్యా పర్యటన పెట్టుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పాకిస్థాన్‌ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు.

రెండు దశాబ్దాల కాలంలో పాక్‌ ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు.

Related posts