భాష్యం విద్యా విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఆదాయం పన్ను , సేల్స్ టాక్స్ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇప్పటివరకు ఇన్ని విధాలుగా భాష్యం విద్యా సంస్థలు మోసాలకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్నారు.
భాష్యం విద్యాసంస్థలు ప్రభుత్వ భూములను, పోరంబోకు భూములను సైతం కబ్జా చేసినట్లు తెలిసిందన్నారు. అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అన్నింటిపైనా సమగ్ర విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థలో లోపాలపై ఎవరైనా తనను నేరుగా సంప్రదించి వివరాలు అందచేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ