telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి కోవిడ్‌ ఫైట్‌ కింద రూ.8025 కోట్లు: నిర్మలాసీతారామన్‌

Nirmalasitaraman

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక నిధులు ఇచ్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి కోవిడ్‌ ఫైట్‌ కింద రూ.8025 కోట్లు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. దేశంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో ఏపీకి 3 స్థానంలో ఉందని, స్థూల దేశీయ ఉత్పత్తిలో ఏపీ 9వ ర్యాంక్‌లో ఉందన్నారు.

ఏపీలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని వెల్లడించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చామని, రూ.500 చొప్పున 3 నెలలు జన్‌ధన్‌ ఖాతాల్లో వేశామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.మత్స్య సంపద యోజన కింద దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఇచ్చామని, ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించామని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లను క్యాన్సిల్‌ చేయడం వల్ల భారతదేశ ప్రాజెక్ట్‌ల్లో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.

Related posts