ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై శుక్రవారం కొందరు గుర్తుతెలియని దుండగులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగింది. కేజ్రీవాల్ కారును ఆపేందుకు దాదాపు వందమంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు అయితే ఈఘటనలో ఎవరు గాయపడలేదు.
దాదాపు వందమంది కర్రలు చేతబట్టుకొని వచ్చి కేజ్రీవాల్ కారును అడ్డగించారు.దాడికి పాల్పడ్డ వారి చేతిలో బీజీపీ జెండాలు ఉన్నాయి. బీజీపీ కార్యకర్తలు ఈదాడికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌ను భద్రతా సిబ్బంది కాపాడిందని తెలిపారు. ఇది ఢిల్లీ పోలీసుల వైఫల్యమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు