టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఆయన తీరుని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు.
‘మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్‌ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు నాయుడు గారూ. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
గతంలో తాను కూడా రెండు సార్లు పార్టీ మారాను: జగ్గారెడ్డి