ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, విప్ బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునీల్‌శర్మ, నర్సింగ్‌రావు, సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిపి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
50శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని తెలిపారు. .30శాతం బస్సులు అద్దె ప్రాతిపదికన, 20శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని సూచించారు. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీసు డ్రైవర్లను ఉపయోగించుకోవాలన్నారు. . బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలన్నారు. అధికారులు రెయింబవళ్లు పనిచేసి బస్సులు నడిచేలా చూడాలని చెప్పారు
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య