సోషల్ మీడియాలో హద్దులు దాటితే పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోషల్ మీడియాతో అసభ్య ప్రచారం చేసింది వైసీపీనే అని అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పై మొదట్లోనే వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిందన్నారు.
జగన్ పై దర్యాప్తు జరగకుండా కుట్రలు చేశారన్నారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై అసభ్యంగా ప్రచారం చేశారన్నారు. టీడీపీ మహిళా నేతలపైనా అసభ్యంగా ప్రచారం చేశారని తెలిపారు. నా కుటుంబ సభ్యులపైన కూడా దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా సహించేది లేదన్నారు.