telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చ‌ర్చ‌లకు రండి…అవసరమైతే నాలుగు మెట్లు దిగడానికైనా రెడీ..

ఏపీ సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు.

అయితే ఉద్యోగ సంఘాల నేతలను త్రోవ‌లోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు.

ఈక్ర‌మంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని, ఉద్యోగులు మా ప్రత్యర్థులో.. శత్రువులో కాదు.. ప్రభుత్వంలో భాగమే అన్నారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు.

పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎక్క‌డో కూర్చుని మాట్లాడితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం రాద‌న్నారు. స‌మ్మెకు వెళ్ల‌డం సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని తెలిపారు.

రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు కూర్చొకుండా షరతులు పెట్టడం సమంజసం కాదని, ఈ విధంగా వ్యవహరించడం సరి కాదు.

అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

 సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు.ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు

ఉద్యోగులు మా కుటుంబంలో వ్యక్తుల లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబంలో వ్యక్తులు అలిగితే వదిలేస్తామా..? ఉద్యోగుల విషయంలోనూ అంతేనని ఆయన వివరించారు.

Related posts