telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హెచ్‌-1బీ వీసాదారులపై ట్రంప్‌ కీలక నిర్ణయం

trump usa

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగాల విషయంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనాతో తమ దేశ ప్రజలకు ఉద్యోగాల పరంగా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, హెచ్‌-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా నిరోధించే ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.

తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే తమ దేశ పౌరులను తొలగించే నిర్ణయాలను తాను ఒప్పుకోనని తెలిపారు. అధిక జీతాలు తీసుకునే నిపుణుల కోసం మాత్రమే హెచ్‌-1బీ వీసాలను వినియోగించాలని, అంతేగానీ, తక్కువ జీతాలకు పనిచేసే వారిని కాదని చెప్పారు. కాగా, 2020 చివరి వరకు హెచ్‌-1బీ వీసాలతో పాటు ఇతర విదేశీ వీసాలను ఇప్పటికే అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే.

Related posts