telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పూర్తిస్థాయి నీటి మట్టం దాటేసిన హుస్సేన్ సాగర్….

హైదరాబాద్ లో నిన్నటినుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు వర్ష పోటెత్తింది. దాంతి పూర్తిస్థాయి నీటి మట్టం దాటేసింది హుస్సేన్ సాగర్. అయితే హుస్సేన్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం హుస్సేన్ సాగ‌ర్ లో 513.70 మీటర్లకు నీరు చేరింది. వాతావరణ శాఖ సూచన నివేదిక ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణలో రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్ప‌టికే కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది.

Related posts