telugu navyamedia
క్రీడలు వార్తలు

టీమిండియా కొత్త జెర్సీ…

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీ లుక్‌ను పోలీ ఉంది. ఈ జెర్సీపై బీసీసీఐ లోగోతో పాటు కేవలం ‘ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021’, ఇండియా అని మాత్రమే రాసుండగా.. మరే స్పాన్సర్ పేరు లేదు. ఐసీసీ ఈవెంట్ కావడంతో స్పాన్సర్లు లేరని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర​ జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘రివైండ్​ టు 1990’అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఇక ఈ నయా జెర్సీపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. స్పాన్సర్లు లేరా?.. షాకింగ్‌గా ఉందని ఒకరంటే.. స్పాన్సర్ల లేకుంటే చూడ ముచ్చటగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. స్వెటర్‌ను పోలీ ఉన్న ఈ జెర్సీపై కొంతమంది వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఇంగ్లండ్‌లో చలి ఎక్కువగా ఉంటుందని, జెర్సీ ఇలా రూపొందించారని కామెంట్ చేస్తున్నారు. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌ వేదికగా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఫైనల్‌కు సంబంధించిన రూల్స్‌ను ఐసీసీ ప్రకటించింది.
ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వుడేను కేటాయిస్తారు.

Related posts