రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), జిహెచ్‌ఎంసి అధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు, ఆరంఘర్(పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే) నుండి ఎయిర్ పోర్టుకు అనుసంధానించే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారికి ఇరువైపుల పుష్పించే మొక్కలతో మల్టీకలర్/మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ (MLAP)ను చేపట్టాలని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు హరిత అనుభవాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బుద్వేల్ వద్ద జిహెచ్ఎంసి ద్వారా చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు