టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. పోలీసులు తమ వాహనంలో చంద్రబాబు ను ఎక్కించుకుని మూడు గంటల పాటు తిప్పిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. డొంకరోడ్డు గతుకుల్లో చంద్రబాబు వాహనం తిప్పడం వెనుక ఆంతర్యం ఏంటీ? అని ప్రశ్నించారు.
చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గుంతల్లో తిప్పడం దుర్మార్గమని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు తనిఖీ చేయని మార్గంలో చంద్రబాబు ఉన్న వాహనాన్ని ఎలా తిప్పుతారు? అని ఆయన ప్రశ్నించారు.