మంచిగా మాట్లాడితే ఎంతసేపయినా నేను సబ్జెక్ట్ పైన మాట్లాడుతానాని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ నన్ను గోకాలంటే ఎంత దూరమైనా తిడతా అని ఆమె వ్యాఖ్యానించారు. ఓ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం నా నోరు మంచిది కాదు. అప్పుడు మాత్రం వదిలిపెట్టను అని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మజ్లిస్, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నేతలతో అసెంబ్లీకి నిండుతనం ఉండేదన్నారు. ,కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక ఉన్న ఆసక్తి కాస్తా పోయిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాలంలో సభాసంప్రదాయాలు పూర్తిగా మంటకలిసి పోయాయని అన్నారు. అప్పట్లో అసెంబ్లీలో సభ్యులు హుందాగా మాట్లాడేవారనీ, వారి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించేదని రోజా తెలిపారు.
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు