telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రజలకు షాక్ : 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని తేల్చేసిన జగన్ సర్కార్ !

corona vacccine covid-19

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని… ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని..ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారని తెలిపారు. వాళ్లు చెబుతున్న లెక్కల ప్రకారం జూన్ వరకు రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయలేరని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా రెమిడెసివిర్ కొరత లేకుండా చూస్తున్నామని.. ఎలాంటి కార్యక్రమంలోనైనా 50 మందికి మించి పాల్గొనకూడదని సూచనలు చేశారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో కూడా 50 మందికి మించి ఉండకూడదని..జిమ్స్, పార్కులు మూసేస్తున్నామన్నారు. బస్సులు, సినిమా హాళ్లల్లో ఓ సీటు వదిలి కూర్చొవాలని… ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఐదు సీట్లు విడిచి కూర్చొవాలని సూచించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయనే అంశంపై జేసీలకు అప్పచెబుతున్నామన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ చూసే జేసీల బాధ్యతలను మిగిలిన జేసీలు చూసుకోవాలని ఆదేశించామని తెలిపారు. నెట్ వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ కోసం క్లస్టర్ మేనేజ్మెంట్ విధానం అవలంభిస్తున్నామని… ప్రతి క్లస్టరుకు జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 11, 354 డోసుల మేర రెమిడెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి…ప్రైవేట్ ఆస్పత్రులకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఎంత మేర అందిస్తున్నామనేది పబ్లిక్ డొమైనులో ఉంచబోతున్నామన్నారు.

Related posts