telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత వల్ల గిల్టీగా… ఇదో నరకంలా భావిస్తున్నా… : ఉపాసన

Upasana

ఉపాసన ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్య చిట్కాలు, పౌష్టికాహారం తయారు చేసుకోవడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మానసిక, భావోద్వేగాల సమతుల్యత లాంటి తాను గాఢంగా నమ్మే కొన్ని సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేశామని ఉపాసన తెలిపింది. అయితే తాజాగా సమంత ఆర్టికల్ చదువుతూ గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది ఉపాసన. వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ URlife కోసం సమంత రాసిన ఈ వ్యాసాలను చదువుతూ తన ఫోటోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఉపాసన “‘రియాలిటీ! సమంత రాసిన ఆర్టికల్ చదువుతున్నాను. మొక్కల నుంచి పౌష్టికాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అనే అంశంపై URlife వెబ్ సైట్‌లో సమంత పేర్కొంది. ఇదో నరకంలా భావిస్తున్నా. నా విషయంలో ఆరోగ్యకరమైన జీవన విధానం ఒక జర్నీలాంటిది తప్ప రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. వెజిటేరియన్‌గా మారి మొక్కల ఆధారిత ఆహారం గురించి ఆమె చెబుతున్న విధానం ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఏదో ఒక రోజు ఆ స్థాయికి చేరుకుంటాను” అని పేర్కొంది.

Related posts