telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికేట్లు పెట్టుకుంటే సహించం

విద్యాసంస్థల్లో మౌళిక సదుపాయాలు లేకుంటే చూస్తూ ఊరుకోమని… ఏ కాలేజీ అయినా ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికేట్ లు పెట్టుకుంటే సహించమని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్ లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామని.. విద్య వ్యాపారం కాకూడదనే ఈ ఆన్ లైన్ విధానం తెచ్చామని తెలిపారు. ఇది కొన్ని కార్పొరేట్ కాలేజీలకు ఇబ్బంది గా మారిందని…అందుకే వారు కోర్ట్ కు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. వసతులు లేని కాలేజీలకు గుర్తింపు రద్దు చేయడానికి మేము వెనకాడమని… టైం లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఈ ఏడాదికి మేము వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మాత్రం వీరిని ఎట్టిపరిస్థితిల్లోనూ సహించమని.. ఆన్ లైన్ విషయంలో కోర్ట్ ఉత్తర్వులను పాటిస్తాం, ప్రస్తుతం కేసు జరుగుతుందన్నారు. ఫైర్ సేఫ్టీ లేకుండా, సరైన మౌళిక సదుపాయాలు లేకుండా కాలేజీలు నిర్వహిస్తాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Related posts