telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీతో తరుణ్ భాస్కర్…

venkey

వెంకటేశ్ తన 75వ సినిమా కోసం, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆల్రెడీ వెంకటేశ్ కథ ఓకే చెప్పేశారని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో తరుణ్ భాస్కర్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుతం వెంకటేశ్ తన 74వ చిత్రంగా ‘నారప్ప’ చేస్తున్నారు. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అసురన్’కి ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేశ్ లుక్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి.

Related posts