telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..పదో తరగతి పరీక్షలు రద్దు

exam hall

పదో తరగతి పరీక్షలపై పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పంజాబ్‌లో కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా పది పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. బోర్డు ఎగ్జామ్స్‌ కంటే ముందు ఆయా పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పైతరగతులకు విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని సీఎం తెలిపారు.

ఇప్పటికే 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ఫైనల్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాయిదా పడ్డ సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

Related posts