telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జోన్‌ ఏదైనా బస్సులు నడపడానికి వీల్లేదు: టీఎస్ఆర్టీసీ

Tsrtc increase salaries double duty employees

తెలంగాణలో ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సులను నడపొద్దని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఆదేశించారు. ఆయన ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజా రవాణాకు సంబంధించి అంతర్రాష్ట్ర బస్సులు, రాష్ట్రంలో నడిచే ప్రయాణికుల బస్సులను అనుమతించకూడదని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అన్ని డిపోల అధికారులు, యూనిట్‌ అధికారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌… జోన్‌ ఏదైనా బస్సులు నడపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మూడు జోన్ల పరిధిలోని కార్యాలయాల అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని సూచించారు. రెడ్‌ జోన్లలో జూనియర్‌ స్కేల్‌ ఆఫీసర్‌ కంటే కింది స్థాయి సిబ్బందిలో 33 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలని తెలిపారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని వంద శాతం సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించారు. గర్భీనీలకు వ్యాధిగ్రస్తులకు విధుల నుంచి మినాహాయింపు ఇవ్వాలని సూచించారు.

Related posts