telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వికారాబాద్ జిల్లాలో వేటగాళ్ల హల్ చల్…

వికారాబాద్ జిల్లాలో వేటగాళ్ల హల్ చల్ కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొనసాగిస్తున్నారు వేటగాళ్లు. వన్యప్రాణుల వేటలో ఓ ఆవు బలైపోయింది. ఆ బలైన ఆవు శరీరం నుంచి ఓ బులెట్ ను సేకరించారు అటవీ అధికారులు. దాంతో వేటకు వచ్చిన వారు ఎవరు.. అనే ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో పోలీసుల తాత్సారం కొనసాగుతుంది. అయితే ఈ ఆవును బలితీసుకున్న వారు దామగుండం అడవిలో నెమళ్ల, జింకల వేటకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అటవీ అధికారులు. హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వచ్చిన ఆ వేటగాళ్ల వెనక పెద్దల హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇంతకముందు కూడా ఇలాంటి ఘ్టనలు జరిగిన పోలీసులు పెద్ద పట్టించుకోలేదు అంటున్నారు స్థానికులు. అధికారుల ఒత్తిడి కారణంగానే అటవీ అధికారులు నిశబ్దంగా ఉంటున్నారు అని సమాచారం. మరి కనీసం ఇప్పుడైనా అధికారులు వారిని పెట్టుకుంటారా… లేదా గతంలో మాదిరిగా పై పైన చర్యలు, విచారణ జరిపి పక్కన పెడతారా అని అంటున్నారు.

Related posts