ఎగువ భారీ వర్షాల దాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం ఒక్కసారిగా 11.75 అడుగులకు పెరగడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గోదావరిలో మళ్లీ వరద ఉద్ధృతి పెరగడంతో 175 గేట్లను ఎత్తి పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో విలీన మండలాల్లో రహదారులపైకి నీరు చేరింది. దీంతో చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలాల్లోని 36 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే, పాపికొండల విహారయాత్రను రద్దు చేశారు.