telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాజీ న్యాయశాఖ మంత్రి .. రాంజెఠ్మలానీ మృతి ..

ram jethmalani died today

నేటి ఉదయం ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయశాఖ మంత్రి రాంజెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ.. తన ఇంట్లోనై వైద్య చికిత్సను తీసుకున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌గా పేరుపొందారు. జెఠ్మలానీ వాదిస్తున్న కేసును మరో లాయర్ తీసుకునేందుకు కూడా భయపడేవారంటే ఆయన వాదన పటిమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన వాదించిన 90శాతం కేసుల్లో విజయం సాధించడం గమనార్హం.

సింధ్ ప్రావిన్స్‌లోని సిఖర్పూర్‌లో రాంజెఠ్మలానీ సెప్టెంబర్ 14, 1923న జన్మించారు. కాగా, సుప్రీంకోర్టు, హైకోర్టులు, విచారణ కోర్టుల్లో వాదించే సమయంలో రాంజెఠ్మలానీ తన పేరును రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీగా పెద్ద అక్షరాలతో రాసేవారు. రాంజెఠ్మలానీ కొడుకు మహేష్ జెఠ్మలానీ, ఆయన కూడా ప్రముఖ న్యాయవాదిగా కొనసాగతున్నారు. జెఠ్మలానీ కూతురు రాణి జెఠ్మలానీ గతంలోనే మరణించగా.. మరో కూతురు అమెరికాలో ఉంటున్నారు.

Related posts