telugu navyamedia
రాజకీయ

యూపీ నాలుగో విడ‌ద‌ పోలింగ్ కొన‌సాగుతోంది..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 నాలుగో విడ‌ద‌ పోలింగ్ కొన‌సాగుతోంది. నాలుగో దశలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

దేశంలోనే అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ , సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి ప్ర‌ధానంగా పోటీ చేస్తున్నాయి.

లఖ్‌నవూ జిల్లాతో పాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరగనుంది. జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ నాల్గో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతున్న స‌మ‌యంలో 8 మంది చ‌నిపోయిన ప్రాంతం ఇది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59స్థానాల్లో భాజపానే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్కర్ష్ వర్మ మధుర్‌ను 37,000 ఓట్ల ఆధిక్యతతో ఓడించి బీజేపీకి చెందిన యోగేష్ విజ‌యం సాధించారు. భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి.

కాగా.. ఏడు దశల యూపీ ఎన్నిక‌ల్లో మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27, మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్ర‌క‌టిస్తారు.

Related posts