telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌ : .. భారీ భద్రత మధ్య .. ఉపఎన్నిక..

huge security for re-election in danthevada

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబరు 21న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. గత ఘటనల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు ఏకంగా 18వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో గల దంతెవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండవి నక్సల్స్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఈ ఘటన జరిగింది.

భీమా మండవిని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు ఆయన వెళ్తున్న కాన్వాయ్‌పై బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో దంతెవాడలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు డీఐజీ సుందరరాజ్‌ తెలిపారు. సీఆర్పీఎఫ్‌, పారామిలిటరీ దళాలు సహా 18వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేస్తామన్నారు. నక్సల్స్‌ కదలికలను పసిగట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తామని వెల్లడించారు.

Related posts