telugu navyamedia
రాజకీయ

ఆ పార్టీకి ఓట్లేస్తే గుండరాజ్, మాఫియా రాజ్: బీఎస్పీ అధినేత్రి మాయావతి

యూపీ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ కొన‌సాగుతుంది. బుధవారం పోలింగ్‌ జరుగుతున్న 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే.. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​కు చేరుకున్న మాయావతి.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు.

సమాజ్‌వాదీ పార్టీ పట్ల ముస్లింలు సంతోషంగా లేరు. ఎస్పీకి ఓటేస్తే గుండరాజ్, మాఫియా రాజ్ వస్తుందని యూపీ ప్రజలకు తెలుసు కాబట్టే వారికి ఓటు వేయరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.

ఎస్పీ ప్రభుత్వ హయాంలో అల్లర్లు జరిగాయని, తాము అధికారంలోకి రాలేమని ఎస్పీ నేతల ముఖాలు చెబుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు 2017లో పోలింగ్ జరగిన ఈ 59 నియోజకవర్గాల్లో.. 51 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ నాలుగు, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ మూడు గెలుచుకుంది.

నేడు పోలింగ్‌ జరుగుతున్న జిల్లాలను పరిశీలిస్తే.. గత అక్టోబర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతున్న స‌మ‌యంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన తర్వాత భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. ఈ ఘటన బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశలు ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలకు లఖింపూర్ ఖేరీ చాలా కీలకంగా మారింది.

Related posts