అధికారం చేతులలో ఉందికదా అని ప్రభుత్వం ఇష్టానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే.. కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాత భవనాలు కూల్చి కొత్త సచివాలయం కట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ విషయం చెప్పడానికి సీఎస్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఆయన కార్యాలయంలో లేకపోవడంతో వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత సచివాలయంలో కొన్ని భవనాలు కట్టి 15 ఏళ్లు కూడా కాలేదన్నారు.
ఈ సచివాలయంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ప్రధాని, రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పారని.. అందుకోసం భవనాలు కూల్చడం సరికాదన్నారు. వాస్తు నమ్మొచ్చన్నారు. కానీ పిచ్చిగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఆలోచనను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు ఒకవేళ ముందుకెళ్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత