telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగీవ్రాల జోరు

నిన్నటితో ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో… అప్పటి వరకు దాఖలైన నామినేషన్ల ఆధారంగా ఏకగ్రీవాలను ప్రకటించారు అధికారులు.. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు.. పల్నాడులోనూ దుమ్ముదిలిపింది వైసీపీ.. మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 85 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా… 85 పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు వైసీపీ అభ్యర్థులు.. ఇక, పల్నాడులో ఏకగ్రీవాల మోత మోగింది.. మాచర్లలో 77 పంచాయతీలకు గాను 74 పంచాయతీలు వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది.. మరోవైపు మంత్రి బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలో 21 పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.. తొలివిడతలో 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.. రెండు విడతల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. మూడో విడతలోనూ అధికార పార్టీ అభ్యర్థులే సత్తా చాటారు. మరోవైపు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సొంత ఊరు రుద్రవరంలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 10 ఏకగ్రీవాలు నమోదు కాగా.. మచిలీపట్నంలోని పెడన మండలంలో నాలుగు, బంటుమిల్లిలో ఒకటి, కృత్తివెన్నులో రెండు, గూడూరులో 3, బందు మండలంలో రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

Related posts