రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు ఎలాంటి పోటీ లేకుండా అధికార పార్టీలు రాజ్యసభ సీట్లను దక్కించుకున్నారు.
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలుకు విజయసాయి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు ఏకగ్రీవమయ్యారు.ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు.
అనంతరం.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు
కాగా.. వైసీపీ ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు అచ్చంగా తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా..తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి సీఎం జగన్‌కు వ్యక్తిగత న్యాయవాది.జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను ఆయన వాదిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. ఇక విజయసాయి రెడ్డి జగన్ కుటుంబ కంపెనీల ఆడిటర్‌గా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు. వచ్చేనెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు.. జగన్ ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్లో… బీద మస్తాన్ రావు, విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.
ఇసుక కొరతను నివారించడంలో ప్రభుత్వం విఫలం: కన్నా