ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై సీఎం జగన్ పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. “ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు. సంగం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబం. ప్రభుత్వ అసమర్ధతను,దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై కక్ష కట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామా ని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలు. 5 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా గెలవడం ఒక రికార్డ్ అయితే.చేసిన సేవా కార్యక్రమాలు,అభివృద్ధి తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ధూళిపాళ్ల నరేంద్ర కి ప్రత్యేక స్థానం ఉంది.అక్రమ కేసులు బనాయించి నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదు.” అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు.
previous post
next post