తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలప్పుడు రాష్ట్ర విభజన ఎంత అప్రజాస్వామికంగా చేశారో అందరికీ తెలిసిందేనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. నేడు మంగళగిరిలో జరిగిన టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన నాయకులందరూ విభజన వద్దని.. సమైక్యాంధ్ర కోసం పోరాడుతుంటే.. తెలంగాణ నేతలంతా మనల్ని మోసం చేశారన్నారు.కేసీఆర్ కుట్రతోనే రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు.
హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడం వల్ల 70 శాతం రెవెన్యూ అక్కడే ఉండిపోయిందన్నారు. ఇన్‌స్టిట్యూషన్స్, ఇండస్ట్రియల్ బేస్ అంతా అక్కడే ఉండిపోయింది. అప్పులను ప్రజానీకం బేసిస్ మీద తీసుకోవాలంటే.. ఎక్కువ అప్పులు మనకొచ్చాయి. పవర్ విషయానికి వస్తే.. పవర్ జనరేరషన్ మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నా కూడా పవర్ కంజప్షన్ ఎక్కువుందని కేసీఆర్ ఆ విషయంలో కూడా కన్విన్స్ చేసి ఎక్కువ పవర్‌ను వాళ్లు తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ జగన్‌కి అంతా తానై సహాయం చేస్తున్నారని జయదేవ్ మండిపడ్డారు.