telugu navyamedia
క్రైమ్ వార్తలు

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడికి సంబంధం లేదు..

అమ్నేషియా పబ్ బాలిక అత్యాచార ఘటనలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడికి సంబంధం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ..ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఈ ఘటనలో ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. వారిలో సాదుద్దీన్‌ మాలిక్‌(18)ని అరెస్టు చేశామని, రాత్రిపూట మైనర్‌ను చట్ట ప్రకారం పట్టుకోకూడదని, 18 ఏళ్లు నిండిన ఉమేర్‌ఖాన్‌, మిగతా ముగ్గురు మైనర్లను పేర్లు చట్ట ప్రకారం వెల్లడించకూదన్నారు. మరో 48 గంటల్లో మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు.

అయితే ఈ కేసులో హోంమంత్రి మనవడు వున్నాడే వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో హోంమంత్రి మనవడు ఎక్కడా లేడని డీసీపీ వెల్లడించారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యం కాలేదని ఆయన చెప్పారు.

వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధితురాలి ఫొటో, పేర్లు ప్రచురించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.  సీసీ ఫుటేజ్, టెక్నీకల్ ఆధారాలు సేకరించామన్నారు. బాలిక స్టేట్మెంట్ తర్వాత సెక్షన్ లు మార్చామన్నారు.

బాధితురాలు కోలుకున్న తర్వాత 164 సెక్షన్‌ ప్రకారం మరోసారి స్టేట్‌మెంట్‌ తీసుకుని, ఇందులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందనే అనేదానిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాం. నిందితులు ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తామ‌ని అన్నారు.

పబ్‌లోకి పార్టీ ఉందని బాలికను తీసుకెళ్లారు. పబ్‌లో పార్టీ ఎలా జరిగిందనే దానిపై ఇంకా దర్యాప్తు చేయలేదు. పబ్‌లో నిబంధనలు అతిక్రమించి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని బాలిక చెప్పలేదు. సీసీ టీవీ ఫుటేజీలో కూడా అలాంటి ఆధారాలు లభించలేదు. నిందితులతో బాలికకు ఇంతకుముందు పరిచయం లేదు. అందుకే వారి పేర్లు కచ్చితంగా చెప్పలేకపోతోంది. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

బాలిక కుటుంబం షాక్‌లో ఉండటంతో ఘటన జరిగిన 3రోజుల వరకు ఫిర్యాదు చేయలేకపోయారు. నాకే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, పోలీస్ స్టేషన్‌ రిఫర్‌ చేశా. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితులు వీడియో తీసినట్టు అనుమానమే తప్ప.. ఎక్కడా ఆధారాల్లేవు. ఈకేసులో ముందుగా బాలికను ఎవరు తీసుకెళ్లారు అనేది చెప్పలేకపోతోంది’’ అని డీసీపీ వెల్లడించారు.

కాగా..అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని.. దర్యాప్తు వేగవంతం చేశారని అలీ అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించమని హోంమంత్రి స్పష్టం చేశారు.

Related posts