telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కుప్పకూలిన హెలికాప్ట‌ర్.. 13 మంది సైనికులు మృతి

helecopter crashed

ఆఫ్రికాలోని మాలీ దేశంలో ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్ అకస్మాత్తుగా కూలింది. సోమ‌వారం సాయంత్రం జరిగిన ఈ ఘ‌ట‌న‌లో 13 మంది ఫ్రెంచ్ సైనికులు అక్కడికక్కడే మృతిచెందారు. జిహాదీల ఏరివేత కోసం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఫ్రాన్స్ అధ్య‌క్ష భ‌వ‌నం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. . దుర్ఘ‌ట‌న ప‌ట్ల ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువెల్ మాక్ర‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాలీ దేశంలో 2012 నుంచి ఇస్లామిక్ మిలిటెంట్లు విధ్వంసం సృష్టిస్తున్నారు.

Related posts