ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను నిలుపుదల చేసి, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కోర్టులు నిమ్మగడ్డ రమేష్ కు బుద్ధి చెప్పాయని కొడాలి నాని ఫైర్ అయ్యారు. నేడు రాష్ట్ర ప్రజలకు సుదినం లాంటిదని..కోవిడ్ వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ను కోర్టులు నిలుపుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని శిఖండి లాంటి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని, చంద్రబాబు చేసిన కుట్ర లకు కోర్టులు బుద్ధి చెప్పాయని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థ లో ఉండి చంద్రబాబు బూటులు నాకుతూ, కులం కోసం పనిచేసే నిమ్మగడ్డ రమేష్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. బుద్ధి మార్చుకోకుండా నిమ్మగడ్డ రమేష్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వెంటపడి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. పార్క్ హయత్ హోటల్ లోనే ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించేందుకు నిమ్మగడ్డకు కు ట్రైనింగ్ ఇచ్చారని…. ఇకనైనా చేసిన పొరపాట్లకు బుద్ధి తెచ్చుకొని నైతిక బాధ్యత వహిస్తూ నిమ్మగడ్డ రమేష్ రాజీనామా చేయాలని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ టిడిపిలో చేరతాడని.. ఉచ్చం, నీచం లేని చంద్రబాబు లాంటి వెధవలు కోసం, రాజ్యాంగ వ్యవస్థ లో ఉండి వెధవ లాగా ఏదైనా చేస్తానంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని తెలిపారు.