telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘జాతిరత్నాలు’ టీజర్ వచ్చేసింది..

ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ సినిమాతో భారీ విజయం సాధించి… తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా ఎదుగుతున్న నటుడు నవీన్ పోలిసెట్టి. షార్ట్ ఫిల్మ్‌స్, యూట్యూబ్ వీడియోలతో తన టాలెంట్‌ చూపించుకున్నాడు. తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా అరంగేట్రం చేశాడు. తన తొలిసినిమాతోనే అందరికి తన ప్రతిభను కనబరిచాడు. ప్రతస్తుతం నవీన్ మరో సినిమా చేశాడు. దాని పేరు ‘జాతిరత్నాలు’. మొదటి సినిమాలో తప్పు చేసిన వారిని పట్టించే డిటెక్టివ్‌గా కనిపించిన నవీన్ ఈ సినిమాలో తానే ఓ దొంగగా కనిపించాడు. ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. 65 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదాల విందు పంచుతూనే ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ డ్రామా ‘జాతిరత్నాలు’లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. శుక్రవారం నుండి ‘ఉప్పెన’ విడుదలైన అన్ని థియేటర్లలోనూ ‘జాతిరత్నాలు’ టీజర్ ను ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు ఆడే చెస్ గేమ్ ను ఇందులో హీరోలు నవీన్, ప్రియదర్శి, రామకృష్ణ కలిసి ఆడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి కామెడీ కాన్సెప్ట్ తో జనంలో ఆసక్తిని రేకెత్తించిన నాగ అశ్విన్… ఈ మూవీని శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేయబోతున్నాడు.

Related posts