telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బొటాక్స్ లో 3 లక్షల 60 వేల భారీ చోరీకి పాల్పడిన మహిళ… వీడియో వైరల్

Botox

టెక్సాస్ లో ఓ మహిళ బొటాక్స్ క్లినిక్‌లో చోరీకి పాల్పడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ టూల్‌తో క్లినిక్ అద్దాలు పగలగొట్టిన సదరు మహిళ విలువైన మెడిసిన్స్ ఎత్తుకెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన టెక్సాస్‌లోని సుగర్‌ల్యాండ్‌లో శుక్రవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే బొటాక్స్ ఆర్ఏన్ ఏండీ స్పా సెంటర్‌లో ఈ చోరీ జరిగింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా… కారులో వచ్చిన సదరు మహిళ క్లినిక్ ముందు ఆపి… పవర్ టూల్‌తో షాపు అద్దాలు పగలగొట్టింది. అనంతరం లోపలికి వెళ్లిన ఆమె విలువైన మెడిసిన్స్ ఎత్తుకెళ్లింది. ఆమె తీసుకెళ్లిన మెడిసిన్స్ విలువ సుమారు 3 లక్షల 60 వేల వరకు ఉంటుందని క్లినిక్ యజమానురాలు అలోంజో పెరెజ్ పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు వీడియోలోని ఫుటేజీ ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్నారు.

Related posts