telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

సూర్యుడిని చేరిన .. నాసా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌…

nasa parker solar probe reached sun orbit

పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్య మండలానికి వెళ్లింది. సూర్యుడి రహస్యాలు శోధించేందుకు రూపొందించిన రాకెట్‌ ఇది. విశ్వంలో మిస్టరీలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న మానవుడికి సూర్యుడి దగ్గరికి వెళ్లాలనేది ఎప్పటి నుంచో తీరని కల. ఈ కలను నిజం చేసింది నాసా. 2018 ఆగస్టులో పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను సూర్యుడి దగ్గరకు పంపింది. ఈ సోలార్‌ ప్రోబ్‌ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేసేందుకు వెళ్లింది. 2025 ఆగస్టు వరకు ఈ ప్రయోగం కొనసాగనుంది. కారు సైజులో ఉండే పార్కర్‌ ప్రోబ్‌ను డెల్టా-4 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. సూర్యుడి కాంతి వలయం అంటే.. కరోనా నుంచి పార్కర్‌ ప్రోబ్‌ సమాచారం అందిస్తుంది. ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఉండి కరోనా నుంచి వెలువడే సౌర తుఫానులపై పరిశోధనలు చేస్తుంది. సౌర తుఫానులు భూమిని తాకితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి ఎలా పుడతాయి? వేగం ఎలా పెరుగుతుంది? లాంటి ప్రశ్నలకు పార్కర్‌ సమాధానాలు సేకరిస్తుంది.

ఈ సమాచారం ఆధారంగా సౌరతుఫాన్ల నుంచి తప్పించుకోడానికి మార్గాలను అన్వేషించవచ్చు. వెంటనే అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సూర్యుడిపై ఏర్పడే అసాధారణ అయస్కాంత విస్పోటనమే సౌర తుఫాన్‌. దీన్ని సైంటిస్టులు G 1 నుంచి G5 వరకు ఐదు వర్గాలుగా విభజించారు. G1 అంటే చిన్నపాటి తుఫాన్‌ కాగా.. G 5 భయంకరమైంది. G 5 సంభవిస్తే గనక ఊహించని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. నాసా తొలిసారి ఈ విషయాల్ని ప్రవేశపెట్టింది. భూ అయస్కాంత స్థితిని బట్టే ఉపగ్రహ వ్యవస్థ పనిచేస్తుంది. సౌర తుఫాన్‌ దుసుకొస్తే భూ అయస్కాంతావరణం దెబ్బతిని, ఉపగ్రహాల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. సూర్యుడి కరోనా నుంచి వెలువడే కణాలు భూమిపై ఉండే అయస్కాంతావరణంలోని పరమాణువులు, అణువులపై ప్రభావం చూపడంవల్ల ఆ శక్తితో పనిచేసే వ్యవస్థ దెబ్బతింటుంది. పర్యవసానంగా జీపీఎస్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, టీవీలు పనిచేయవు.

Related posts