telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త మున్సిపల్ చట్టం పై తెలంగాణ సర్కార్ కసరత్తు!

huge job notification in telanganaf

కొత్త మున్సిపల్ చట్టం పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా భాగంగా ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంతో పాటు మండలి కూడా సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ నేపథ్యంలో 17న మంత్రివర్గ సమావేశం, 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నూతన పురపాలక బిల్లుపై సమగ్ర చర్చ జరిపిన అనంతరం ఆమోదముద్ర వేస్తారు. దీనిపై తెలంగాణలోని పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. పురపాలక ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై కేబినెట్ ముఖ్యంగా చర్చించనుంది.

మరో వైపు పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ప్రకటన తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల 16వ తేదీన ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించనుంది. మూడు కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను వెల్లడించే అవకాశముంది.

Related posts