telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్

T Congress boycott mlc elections

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో లక్ష రూపాయల రుణమాఫీ, నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పెంచిన పింఛన్లు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరిగే మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీనీ అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ టీఆర్‌ఎస్‌ కు పోటీ బీజేపీయేనని, కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ నాయకులు అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. గత మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు కూడా రాబో యే ఎన్నికల్లో రావని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

Related posts