telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశాన్ని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలు మొద‌ల‌య్యాయి- కేసీఆర్‌

దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గాల్వాన్ వాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు సాయం అందజేసేందుకు శుక్రవారం రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు జాతీయ రాజకీయాలపై జార్ఖండ్‌ సీఎంతో చర్చించారు.

telangana cm k chandrashekhar rao reached jharkhand know which issues discussed by meeting cm hemant soren smj | झारखंड पहुंचे तेलंगाना के CM के चंद्रशेखर राव, जानें सीएम हेमंत सोरेन से भेंट

ఈ సందర్భంగా ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. హేమంత్‌ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్‌ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్న సీఎం.. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్య‌మానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మ‌ద్ద‌తు ప‌లికారని, రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించారని గుర్తు చేశారు.

Telangana CM KCR meets Jharkhand's Hemant Soren, denies formation of 'anti-BJP' front

‘కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌లో న‌డ‌వ‌డం లేదని, దాన్ని స‌రి చేయాల్సిన బాధ్య‌త ప్ర‌తి పౌరుడిపై ఉందన్నారు. దేశానికి కొత్త అజెండా కావాలని, ఈ నేప‌థ్యంలో ప‌లువురి నేత‌ల్ని క‌ల‌వ‌డం జ‌రుగుతోందని తెలిపారు.

యాంటీ బీజేపీ ఫ్రంట్ సాగిస్తున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. అచ్చే భారత్ కావాల‌ని, భార‌త్‌ను స‌రైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌ని.. ఆ దిశ‌లో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడు ఎటువంటి ఫ్రంట్ లేదని.. ఏదైనా ఉంటే చెబుతామని పేర్కొన్నారు. కాస్త ఓపిగ్గా ఉంటే.. మున్ముందు విపులంగా విష‌యాల‌ను వెల్ల‌డిస్తాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

పురోగామి భారత్‌ను నిర్మించడంలో జర్నలిస్టుల పాత్రను కూడా మేం ఆశిస్తున్నాం అన్నారు. దీనికి ఇప్పుడే పేరు పెట్టకండి.. నేను చెప్పదల్చుకున్న విషయాలను స్వచ్ఛమైన, మంచి మనసుతో, అర్థవంతంగా చెప్తున్నాను.

ప్రస్తుతమున్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయలనేదే మా ఆకాంక్ష అని… అందుకు అనుగుణంగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. 

Related posts