telugu navyamedia
తెలంగాణ వార్తలు

జులై 3న హైద‌రాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ

వ‌చ్చే నెల‌ మూడోతేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.  ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సభ నిర్వహణ కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌ను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు.

Is Modi lying or Amit Shah? Mamata's TMC questions contradictory tweets on village electrification

అలాగే జులై 2, 3, 4 తేదీల్లో తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌, నోవాటెల్‌లో జరగనున్నాయి.

ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానుండటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 3వ తేదీన బహిరంగ సభను నిర్వహించడానికి జాతీయ నాయకత్వం అంగీకరించింది.

BJP to hold two-day national executive meet in Hyderabad in July - The Hindu

జులై 3వ తేదీన జరిగే బహిరంగ సభకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా 18 రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఉపముఖ్యమంత్రులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా కార్యవర్గ సమావేశాలుంటాయని లక్ష్మణ్‌ తెలిపారు.

Related posts